MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు
Rajinikanth, Mohan Babu, Brahmanandam, Harish Shankar etc
ప్రముఖ నటుడు, నిర్మాత, పద్మ శ్రీ డాక్టర్ ఎం. మోహన్ బాబు తన 50 ఏళ్ల సినీ ప్రయాణానికి సంబంధించిన కార్యక్రమంలో భారతీయ సినిమా, రాజకీయ ప్రముఖుల్ని ఒకే వేదికపైకి తీసుకు వచ్చారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగిన ఈ వేడుకలో తారలంతా సందడి చేశారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, దిగ్గజ వ్యాపారవేత్తలు, సన్నిహితుల సమక్షంలో MB50 వేడుకలు ఘనంగా జరిగాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ తో మోహన్ బాబుకు గత దశాబ్దాలుగా ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఆ ప్రేమకు, స్నేహానికి చిహ్నంగా MB50 వేడుకల్లో రజినీకాంత్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ఎందరో రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరందరూ కూడా మోహన్ బాబు గారికి శుభాకాంక్షలు తెలిపారు. మోహన్ బాబు కుమారుడు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు ఈ కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు.
తెరపై నిర్మాతగా, నటుడుగా ఎన్నో గొప్ప చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన మోహన్ బాబు.. విద్యావేత్తగా ఎన్నో వేల మందిని గొప్ప పౌరులుగా తీర్చి దిద్దారు. విద్యా వేత్తగా, నటుడిగా, నిర్మాతగా తెలుగు ప్రజలపై మోహన్ బాబు గారు చెరగని ముద్రను వేశారు. తన యాభై ఏళ్ల సినీ ప్రయాణానికి గుర్తుగా ఆదివారం నాడు ఏర్పాటు చేసిన భారీ విందులో అతిరథ మహారథులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
సినీ పరిశ్రమ నుంచి బ్రహ్మానందం, హరీష్ శంకర్, టీజీ విశ్వ ప్రసాద్, అల్లు అరవింద్, దిల్ రాజు, మైత్రి శశి, జయసుధ,నాని, నాజర్, ఆది సాయి కుమార్, సందీప్ కిషన్, వీకే నరేష్, గోపీచంద్, శ్రీకాంత్, శ్రీను వైట్ల, శ్రీకాంత్ ఓదెల వంటి వారు ఈ వేడుకలో పాల్గొన్నారు.