కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?
సుదీర్ఘకాలం తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించింది. అయితే ఈ అవకాశాన్ని రజనీకాంత్ చేజార్చుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ 173వ చిత్రం దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు సుందర్ సి ప్రకటించడం కోలీవుడ్‌లో సంచలనానికి దారితీసింది.
అనివార్య పరిస్థితుల దృష్ట్యా తలైవర్ 173వ సినిమా నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నానని సుందర్ సి ప్రకటించారు. కాగా, ఈ ప్రకటన పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఎక్స్ వేదిక నుంచి ఖుష్బూ తొలగించారు. అయితే రజనీకాంత్ 173వ సినిమాకు బ్రేక్ పడిన కారణం వేరు అని తెలుస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన ఇంట్లో నడుస్తూ కాలిజారి పడ్డారని.. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఈ సినిమాకు బ్రేకిచ్చారని కోలీవుడ్ కోడై కూస్తోంది.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇది పాత వీడియో అని కొందరు వాదిస్తుండగా.. ఆయన కింద పడటం వల్లే సినిమా ఆగిపోయిందని మరికొందరు అంటున్నారు.