1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Naveen yadav reacts after Jubilee hills victory

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

Naveen Kumar Yadav
Naveen Kumar Yadav
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ కుమార్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అవ్వడానికి పడ్డ కష్టాలను గుర్తుచేసుకొని నవీన్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. గెలిచిన అనంతరం మా నాన్న, అమ్మ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకొని రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చానన్నారు. 
 
జాగృతి ప్రెసిడెంట్ కవితకు తనతో మంచి సంబంధాలున్నాయని నవీన్‌ బాంబ్‌ పేల్చారు. నిజంగానే కవిత ట్వీట్ చేసినట్టుగానే కర్మ సిద్ధాంతం వల్ల టిఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కేటీఆర్ కూడా తనతో గతంలో బాగానే ఉండేవాడని, కానీ ఈ చెత్త రాజకీయాల వల్ల చెడిపోయాడన్నారు. 
 
తాను ఎమ్మెల్యేగా చేయబోయే మొదటి పని జూబ్లీహిల్స్‌కు డిగ్రీ కాలేజ్ తేవడమే అన్నారు. అందరిని కలుపుకొని పోతానన్నారు. ఎంతో కష్టపడి జూబ్లీహిల్స్ కార్యకర్తలు తనను గెలిపించుకున్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధే తన ఎజెండా అని పేర్కొన్నారు
 
మాలాంటి వాళ్లు రాజకీయంగా నిలబడడానికి 40 సంవత్సరాలు పట్టిందని భావోద్వేగానికి గురయ్యారు.గతంలో అనేక అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తర్వాతి కథనం
జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు