మంగళవారం, 9 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 15 నవంబరు 2025 (13:21 IST)

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

khushbu
తనను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లకు సినీ నటి ఖుష్బూ తనదైనశైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనను ఎవరూ ఐటెమ్ సాంగ్ చేయమని కోరలేదని, కానీ మీ కుటుంబంలో ఎవరినైనా చేయమన్నారేమో అనుకున్నా అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. 
 
కమల్ హాసన్ నిర్మాతగా, రజనీకాంత్ హీరోగా ఖుష్భూ భర్త సుందర్ సి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే ఈ ప్రాజెక్టు దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పకుంటున్నట్టు సుందర్ సి ప్రకటించారు. దీనికి కారణం ఖుష్బూనే అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ చిత్రంలో ఖుష్బూను ప్రత్యేక పాట చేయమన్నారని అందుకే ఆమె భర్త ఈ చిత్రం నుంచి వైదొలగారంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఆ పోస్ట్‌లపై ఖుష్బూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి ఒక పోస్ట్‌కు స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. 'లేదు నన్ను ఐటెమ్‌ సాంగ్‌ చేయమని ఎవరూ అడగలేదు. మీ కుటుంబంలో ఎవరినైనా చేయమన్నారేమో అనుకున్నా' అని అన్నారు. ఆమె రిప్లైపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ధైర్యంగా సమాధానం చెప్పారని కామెంట్స్‌ చేస్తున్నారు. 
 
ఇక ఈ సినిమా నుంచి సుందర్‌ వైదొలగడానికి కారణం స్క్రిప్ట్‌ అని.. సరైన కథ లేకపోవడం వల్లే ఆయన వైదొలిగారని ప్రచారం జరుగుతోంది. దీనిపైనా ఖుష్బూ స్పందించారు. ఈ వార్తలను తోసిపుచ్చారు. ఎలాంటి ఆధారం లేకుండా ఇలాంటి వార్తలు ఎలా బయటకు వస్తాయో అర్థం కావడం లేదన్నారు.