శుక్రవారం, 1 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 31 జులై 2025 (19:27 IST)

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

Mayasabha team with sai tej
Mayasabha team with sai tej
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ నుంచి రాబోతోన్న ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ఇప్పటికే సెన్సేషన్‌గా మారింది. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇక ‘మయసభ’ టీజర్‌ను ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో గురువారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
 
*Sony LIV Original "Mayasabha" Trailer* - https://youtu.be/ujtl5CkgQSs 
 
సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ .. ‘దేవా గారితో నాది పదేళ్ల ప్రయాణం. ‘ఆటోనగర్ సూర్య’ చూసిన వెంటనే దేవా గారికి ఫోన్ చేసి మాట్లాడాను. అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది. అలా ఆ జర్నీ నుంచి ‘రిపబ్లిక్’ వచ్చింది. ‘రిపబ్లిక్’ టైంలో జరిగిన ఘటనలో నాకు ఎప్పుడూ అండగా నిలిచారు. ఇప్పుడు ఇలా మళ్లీ దేవా కట్టా గారి కోసం ఇలా ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఓ మూడు పార్టులకు సరిపడా కథను రాశాను అని దేవా కట్టా గారు ‘మయసభ’ గురించి గతంలోనే ఎప్పుడో చెప్పారు. ఆది, చైతన్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. 30 వెడ్స్ 21 చూసి మా అమ్మ నన్ను పెళ్లి గురించి అడుగుతూ ఉండేవారు. అలా నా లైఫ్‌లో చైతన్య విలన్‌లా మారిపోయాడు. ‘రిపబ్లిక్’ టైంలో సాయి కుమార్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ‘మయసభ’ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఈ సిరీస్ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
దేవా కట్టా మాట్లాడుతూ, ‘మయసభ’ అనేది అందమైన ఊహ. ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణమే ఈ కథ. పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం ఏంటి? అనే కాన్సెప్ట్‌తో తీశాం. ఈ కాన్సెప్ట్ నాకు చిన్నప్పటి నుంచీ మెదడులో కదులుతూనే ఉండేది. అయితే శ్రీ హర్ష అనే వ్యక్తి నా వద్దకు వచ్చి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు. అప్పుడు మొదలైందే ఈ ‘మయసభ’. ముందుగా మూడు పార్టులుగా సినిమాకు సంబంధించిన కథ రాశాను. అయితే సినిమాగా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఆ తరువాత ఇదే కథను ఓ సిరీస్‌లా ఓ సీజన్‌ను రాసుకున్నాను. ‘మయసభ’ ఇక్కడి వరకు రావడానికి చాలా టైం పట్టింది. ఆది నటన అంటే నాకు చాలా ఇష్టం. హీరో, విలన్, ఏ పాత్ర అయినా కూడా అద్భుతంగా నటించేస్తారు. ఈ కథ అనుకున్న వెంటనే నాకు ఆది గుర్తుకు వచ్చారు. ఆదిని మ్యాచ్ చేసేందుకు చైతన్య కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం 264 మందిని తీసుకున్నాం. దివ్యా గారు అద్భుతంగా నటించారు. ఈ ప్రాజెక్టుని జ్ఞాన శేఖర్‌తో స్టార్ట్ చేశాం. ఆ తరువాత సురేష్ ఈ ప్రాజెక్ట్‌ని అద్భుతంగా మలిచారు. ప్రొడక్షన్ డిజైనర్ కామేష్, తిరుమలకు థాంక్స్. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తం అయ్యాక కిరీటం పెట్టినట్టుగా.. శక్తి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. ఆగస్ట్ 7 నుంచి ‘మయసభ’ అందరి ముందుకు రానుంది. ‘మయసభ’ అందరి ఆస్తిలా మారిపోతోంది’ అని అన్నారు.
 
సోనీ లివ్ బిజినెస్ హెడ్ ధనీష్ కాంజీ మాట్లాడుతూ, 2022లో ఈ కథను దేవా కట్టా గారు మాకు వినిపించారు. సోనీ లివ్‌లో ఇదొక గొప్ప సిరీస్‌గా నిలిచిపోతుందని నమ్ముతున్నాం. ఈ సిరీస్ ఆగస్ట్ 7న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 
ఆది పినిశెట్టి మాట్లాడుతూ, శక్తి ఇచ్చిన మ్యూజిక్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ సిరీస్‌లో అందరూ అద్భుతంగా నటించారు. సాయి కుమార్ గారు, నాజర్ గారు, దివ్యా దత్త గారు ఇలా ప్రతీ ఒక్కరూ అందరూ గొప్పగా నటించారు. చైతన్య రావ్ అద్భుతమైన నటుడు. ‘మయసభ’ ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్‌‌‌లోకి రాబోతోంది. ‘ప్రస్థానం’, ‘రిపబ్లిక్‌’‌లా ‘మయసభ’ నిలిచిపోతుంది. రెండో సీజన్ కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.
 
చైతన్య రావ్ మాట్లాడుతూ,  ఆదితో నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఆది నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. నా ప్రయాణంలోని ప్రతీ మైల్ స్టోన్‌లో నాకు ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నారు. నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ‘మయసభ’ ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలుస్తుంది’ అని అన్నారు.
 
నిర్మాత శ్రీ హర్ష మాట్లాడుతూ .. ‘‘మయసభ’ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఎనిమిదేళ్ల క్రితం కలలు కన్న ప్రాజెక్ట్‌కి ఇప్పుడు రూపం వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను దేవా గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ అందరినీ మెప్పిస్తుంది’ అని అన్నారు.
 
నిర్మాత విజయ్ కృష్ణ లింగమనేని మాట్లాడుతూ, ఆది, చైతన్య రావు, సాయి కుమార్ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. శక్తి కాంత్ మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
 
చరితా వర్మ మాట్లాడుతూ .. ‘నన్ను నమ్మి నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దేవా కట్టా గారికి థాంక్స్. ఆది, చైతన్య గార్లతో పని చేయడం ఆనందంగా ఉంది. మా కోసం ఈవెంట్‌కు వచ్చిన తేజ్ గారికి థాంక్స్. ‘మయసభ’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
 
నటి దివ్యా దత్తా మాట్లాడుతూ .. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవా కట్టా గారికి థాంక్స్. ఇలాంటి పాత్రలు పోషించే అవకాశం అరుదుగా వస్తుంటుంది. తెలుగులో ఇది నాకు ఫస్ట్ ప్రాజెక్ట్. ఇంత మంచి ప్రాజెక్ట్‌తో తెలుగులోకి వస్తుండటం ఆనందంగా ఉంది. ‘మయసభ’ సెట్‌‌లో సరదాగా అందరం కలిసి నటించాం. ఈ టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌కి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
 
శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ .. ‘దేవా కట్టా గారితో రిపబ్లిక్‌ మూవీని చేశాను. ప్రతీ షాట్‌ను ఆయన చెక్కుతూనే ఉంటారు. దేవా గారు చాలా గొప్ప దర్శకుడు. ఆది, చైతన్య, సాయి కుమార్ ఇలా అందరూ అద్భుతంగా నటించేశారు. ‘మయసభ’ అద్భుతంగా ఉండబోతోంది’ అని అన్నారు.
 
రవీంద్ర విజయ్ మాట్లాడుతూ .. ‘సోనీ లివ్‌తో కలిసి నేను చేస్తున్న నాలుగో సిరీస్ ఇది. దేవా గారితో పని చేయడం గొప్ప విషయం. ప్రతీ నటుడికి స్కోప్ ఇస్తుంటారు. స్క్రీన్ మీద మా అందరితో మ్యాజిక్ చేయించారు. ‘మయసభ’ గొప్పగా ఉండబోతోంది’ అని అన్నారు.
 
కెమెరామెన్ సురేష్ మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన తేజ్ అన్నకు థాంక్స్. నాకు ఈ ప్రాజెక్టులో అవకాశం ఇచ్చిన కిరణ్, దేవా సర్‌లకు థాంక్స్. ఈ సిరీస్ అద్భుతంగా ఉంటుంది’ అని అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ శక్తి కాంత్ కార్తీక్ మాట్లాడుతూ .. ‘‘మయసభ’ ఈవెంట్‌కు వచ్చిన తేజ్ గారికి థాంక్స్. నాకు ఈ సిరీస్‌లో అవకాశం ఇచ్చిన దేవా గారికి థాంక్స్. బృందా తరువాత సోనీ లివ్‌లో ఇది నాకు రెండో ప్రాజెక్ట్. ‘మయసభ’ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.