శుక్రవారం, 1 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 31 జులై 2025 (17:45 IST)

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

Honeymoon in Shillong Poster
Honeymoon in Shillong Poster
సమాజంలో ఏ సంఘటన జరిగినా దానిని వెంటనే సినిమా మలిచే ప్రక్రియ కొనసాగడం మామూలే. మనకు తెలిసి రామ్ గోపాల్ వర్మ ఇటువంటి కథలతో సినిమాగా మార్చడం మామూలే. కానీ ఆమధ్య జూన్ నెలలో హనీమూన్ కోసం వెళ్ళిన షిల్లాంగ్ వెళ్ళిన సోనమ్ భర్తను ప్రియుడితో చంపించడం పెద్ద సెన్సేషనల్ గా మారింది. దీనిని సినిమాగా తీయడానికి బాలీవుడ్ పలువురు ప్రయత్నించగా దర్శకుడు ఎస్.పి. నింబావత్ ముందుకు వచ్చారు. దీనికి హనీమూన్ ఇన్ షిల్లాంగ్ అనే పేరు పెట్టారు.
 
ఈ సంఘటనను సినిమాగా తీస్తే ప్రజలకు ఏమి జరిగిందో తెలుస్తుందని మ్రుతుడు రాజా రఘువంశీ కుటుంబం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ 80 శాతం పూర్తయింది. త్వరలో వెండితెరపై ఆవిష్కరణ ప్రారంభంకానుంది. భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు జరగకూడదని చిత్రాన్ని రూపొందిస్తున్నానని దర్శకుడు తెలిపారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ, "ఇది కేవలం సినిమా కాదు, సున్నితమైన నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించిన కథ. మేము దీనిని అత్యంత బాధ్యతాయుతంగా  చేస్తాము. అన్నారు. 'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' యొక్క మొదటి పోస్టర్ ఇటీవల సోషల్ మీడియాలో విడుదల చేశారు.