నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్
Nara Rohit, Sri Devi Vijay Kumar
ప్లీజ్ మేమ్ సాంగ్ మోడ్రన్ బీట్‌లతో పాటు తెలుగుదనం కూడా మిక్స్ అయి క్యాచీ, క్రేజీగా వుంది. శ్రీహర్ష ఇమాని రాసిన లిరిక్స్ ఫన్ ఫుల్ గా పాటకి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. వీడియోలో హీరో తన ఫ్రెండ్స్‌తో కలిసి శ్రీదేవిని ఇంప్రెస్ చేయడానికి చేసే ప్రయత్నాలు సరదాగా వున్నాయి.
అర్జున్ చాందీ, దీపక్ బ్లూ, అరవింద్ శ్రీనివాస్, సాయిశరణ్, రేష్మా శ్యామ్, హరిప్రియా, లవితా లోబో కలిసి పాడిన ఈ పాటఅదిరిపోయింది. అందరి వాయిస్ మిక్స్‌తో పాటకి ఎనర్జీ రెట్టింపు అయ్యింది. విశ్వరఘు చేసిన కొరియోగ్రఫీ స్టైలిష్‌గా వుంది.
నారా రోహిత్ – శ్రీదేవి విజయ్ కుమార్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. "ప్లీజ్ మేమ్" పాట సినిమా ఆల్బమ్‌కి ఫ్రెష్ అండ్ ఫన్ టచ్ ఇచ్చి బ్యూటిఫుల్ ట్రాక్ గా నిలిచింది.
ఈ చిత్రంలో వృతి వాఘాని కథానాయికగా నటించారు. గణేష్ చతుర్థి సందర్భంగా ఆగస్టు 27న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రదీప్ ఎం. వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, రాజేష్ పెంటకోట ఆర్ట్ డైరెక్టర్‌గా, సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.,
తారాగణం: నారా రోహిత్, వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూప లక్ష్మి, సునైనా, రఘు బాబు.
