ఆదివారం, 5 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 అక్టోబరు 2025 (13:12 IST)

Leopard: గోడదూకి రోడ్డుపైకి వచ్చిన చిరుత.. మహిళపై దాడి.. తరిమికొట్టిన జనం (video)

Leopard
Leopard
చిరుత దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగానే వున్నాయి. చిరుత పులుల సంచారం జన వాసాల్లో అధికమయ్యాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత సంచారం ఒక్కసారిగా కలకలం రేపింది. రెప్పపాటులో కుక్కపై దాడి చేసిన చిరుత.. అనంతరం దానిని నోట పట్టుకుని.. అక్కడి నుంచి ఎత్తుకెళ్లింది. చిరుత సంచారంతో కళ్యాణ దుర్గం వాసులు భయాందోళనతో వణికిపోతున్నారు. 
 
ఇదిలా వుంటే మరో చిరుత రోడ్డుపై సంచరించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రోడ్డుపై జనాలు తిరుగుతుండగా వున్నట్టుండి చిరుత ప్రహరీ గోడపై నుంచి కిందకు దూకింది. దీన్ని చూసిన వారంతా షాకయ్యారు. చిరుతను చూసి పరుగులు తీశారు. అంతవరకు ప్రశాంతంగా రోడ్డుపై నిలబడి కబుర్లు చెప్పుకున్న వ్యక్తులు చిరుత కనిపించగా షాక్ అయ్యారు. 
 
అయితే రోడ్డుపై నడుస్తూ వెళ్లిన ఓ మహిళపై చిరుత దాడి చేసింది. ఆమెను దాడి చేస్తున్న చిరుతను తరిమికొట్టేందుకు ఆ ప్రాంత స్థానికులు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో సఫలం అయ్యారు. 
 
స్థానికులు మూకుమ్మడిగా చిరుతను తరిమేందుకు ఏకం కావడంతో ఆ చిరుత మహిళను వదిలిపెట్టి పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.