Woman: ఆమె వయస్సు 19 సంవత్సరాలే.. భర్తతో గర్భా ఆడుతూ కుప్పకూలిపోయింది.. (video)
వయసుతో నిమిత్తంలేకుండా హర్ట్ ఎటాక్‌లు ఎక్కువయ్యాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. జిమ్ చేస్తు, డ్యాన్స్ చేస్తున్న వాళ్లు కూడా హర్ట్ ఎటాక్‌కు గురవుతున్నారు. తాజాగా.. మధ్య ప్రదేశ్‌లో గర్బాడ్యాన్స్ చేస్తుండగా ఒక మహిళ హార్ట్ స్ట్రోక్‌కు గురైంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ - ఖర్గోన్ జిల్లాలో భర్తతో కలిసి దుర్గాలయంలో గర్బా ఆడుతూ 19 ఏళ్ల వివాహిత గుండెపోటు రావడంతో మృతి చెందింది. తన భర్తతో చక్కగా డ్యాన్స్ చేస్తు, అమ్మవారి విగ్రహం ముందు గర్భా డ్యాన్స్ చేస్తుంది. ఇంతలో కింద పడిపోయి నొప్పితో విలవిల్లాడి చనిపోయింది. దీంతో ఆమెను ఎంత కదిలించిన లేవలేదు. వెంటనే ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు.
సదరు మహిళకు కేవలం 19 ఏళ్లు. గుండెపోటు కారణంగా చనిపోయిందని వైద్యులు తెలిపారు. అప్పటి వరకు తనతో ఆనందంగా ఆడుతూ కనిపించిన భార్య... కళ్ల ముందే చనిపోవడం చూసి ఆ భర్త రోదన అందరినీ కదిలించింది.