బుధవారం, 24 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 24 సెప్టెంబరు 2025 (20:06 IST)

విజయవాడ భవానీపురంలో మహిళ పీక కోసిన వ్యక్తి (video)

Man attack on woman
విజయవాడ భవానీపురంలో దారుణం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న లక్ష్మీదేవి అనే మహిళను వెంబడించిన అప్పారావు అనే వ్యక్తి కత్తితో ఆమె పీక కోసాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన అంతా సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యింది.
 
బాధితురాలు గొంతువద్ద నుంచి రక్తం కారుతుండగా పక్కనే వున్న పిండిమర వద్ద మెట్లపై పడిపోయింది. పిండిమరను నడిపే మహిళ రోడ్డుపై వున్న స్థానికులకు సమాచారం అందించడంతో వెంటనే ఆమెను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా మహిళపై దుండగుడు అప్పారావు ఎందుకు దాడి చేసాడన్నది తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పారావు కోసం గాలిస్తున్నారు.