మంగళవారం, 29 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 జులై 2025 (15:30 IST)

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

crime
నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటికి పిలిపించుకుని ప్రియుడిని హతమార్చించింది.. ఓ వివాహిత. వివరాల్లోకి వెళితే.. తరుణ్ తేజ్ అనే వ్యక్తికి ప్రవళికతో పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ తరుణ్‌కు మాధవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎప్పటిలాగే మాధవి.. ప్రియుడు తరుణ్ తేజ్ ఇంటికి పిలిపించి.. హత్య చేసింది. 
 
అయితే దీనిపై తరుణ్ తేజ్ భార్య ప్రవళిక సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తను మాధవితో పాటుగా మరికొందరు కలిసి హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు జరుపుతున్నారు.