మంగళవారం, 4 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : సోమవారం, 3 నవంబరు 2025 (18:09 IST)

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

Shyamala Devi blessings to director Parameshwar Hivrale
Shyamala Devi blessings to director Parameshwar Hivrale
రాజకీయ నాయకుడు.. అజాత శత్రువు.. నిజాయితీ పరుడు.. ప్రజల కోసం బతికే నాయకుడైన గుమ్మడి నర్సయ్య లాంటి వ్యక్తి చరిత్రను తెరపైకి తీసుకు వస్తుండటం సాహసం అనే చెప్పాలి. ఆ సాహసాన్ని డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే చేస్తున్నారు. ఈ సాహసానికి ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ తరుపున ఎన్. సురేష్ రెడ్డి అండగా నిలబడ్డారు. ఇక ‘గుమ్మడి నర్సయ్య’గా కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ కనిపించబోతోన్నారు.
 
కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. గుమ్మడి నర్సయ్య పాత్రలో శివ రాజ్ కుమార్ ఎలా కనిపిస్తారు? ఏ మేరకు ఆకట్టుకుంటారు? అని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేశారు. గుమ్మడి నర్సయ్య పాత్రకు శివన్న ప్రాణం పోసేందుకు సిద్దంగా ఉన్నారని అర్థమైంది. ఆ పాత్రకు తగ్గ ఆహార్యంతో శివన్న అందరినీ ఆకట్టుకున్నారు. చిన్న మోషన్ పోస్టర్‌తోనే దర్శకుడు పరమేశ్వర్ తన టాలెంట్ ఏంటో చూపించారు. ఇక ఈ మోషన్‌ పోస్టర్‌ను చూసిన శ్యామలా దేవీ గారు దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తారు. 
 
మోషన్ పోస్టర్ గురించి శ్యామలా దేవీ గారు మాట్లాడుతూ .. ‘ఎక్సలెంట్‌గా ఉంది.. ఈ మోషన్ పోస్టర్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది.. ఎన్ని అవార్డులు వస్తాయో తెలుస్తోంది.. గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ గారు ప్రాణం పెట్టి నటిస్తున్నట్టుగా కనిపిస్తోంది.. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మించబోతోన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడిగా సురేష్ బొబ్బిలి, ఎడిటర్‌గా సత్య గిడుటూరి పని చేస్తున్నారు. త్వరలోనే మూవీకి సంబంధించిన ఇతర ఆర్టిస్టులకి సంబంధించిన విషయాల్ని ప్రకటించనున్నారు.