సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (15:01 IST)

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

Dil Raju
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అపెక్స్ కోర్టు ఆదేశించింది. దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలంటూ ట్రయల్ కోర్టు గతంలో ఆదేశాలు జారీచేసింది. వీటిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. "నా మనసు నిన్ను కోరే నవల" ఆధారంగా "మిస్టర్ ఫర్ఫెక్ట్" అనే సినిమా తీశారంటూ రచయిత్రి శ్యామలాదేవి 2017లో దిల్ రాజుపై కేసు పెట్టారు. 
 
దీంతో పోలీసులు నిర్మాత దిల్ రాజుపై కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జరిగింది. ఇందులోని సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వీటిపై దిల్ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఊరట లభించింది. 
 
కాగా, ఈ యేడాది సంక్రాంతికి ఆయన నిర్మించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఒకటి "గేమ్ ఛేంజర్" కాగా, మరొకటి "సంక్రాంతికి వస్తున్నాం". వీటిలో "సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అదేసమయంలో ఆయన నివాసంలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు చేసిన విషయం తెల్సిందే.