Gram Panchayats Polls: తెలంగాణలో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు.
షెడ్యూల్ ప్రకటించడంతో, ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ. రాణి కుముదిని మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. మొదటి దశ ఎన్నికలు డిసెంబర్ 11న, రెండవ దశ డిసెంబర్ 14న, మూడవ దశ డిసెంబర్ 17న జరుగుతాయి.
మొదటి దశకు నామినేషన్ పత్రాల దాఖలు నవంబర్ 27 నుండి, రెండవ దశకు నవంబర్ 30 నుండి, మూడవ దశకు డిసెంబర్ 30 నుండి ప్రారంభమవుతుంది.