శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (16:36 IST)

ఆస్పత్రి టాయిలెట్‌లో నెలలు నిండని పిండాన్ని ప్రసవించిన రేప్ బాధితరాలు!!

కేరళ రాష్ట్రంలో ఓ అత్యాచార బాధితురాలు నెలలు నిండని పిండాన్ని ప్రసవించింది. ఆ పిండాన్ని టాయిలెట్‌లో వేసి నీటిని ఫ్లష్ చేసింది. ఈ ఘటన కొచ్చిన్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బుధవారం ఒక మైనర్‌ బాలిక తల్లితో కలిసి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చింది. వారి వంతు కోసం వేచి ఉండగా ఆ బాలిక ఆసుపత్రిలోని టాయిలెట్‌కు వెళ్లింది. 
 
అక్కడ ఆ యువతి ఆరు నెలల పిండాన్ని ప్రసవించింది. ఆ తర్వాత పిండాన్ని టాయిలెట్‌ బేసిన్‌లో పడేసి ఫ్లష్‌ చేసి బయటకు వచ్చింది. అనంతరం ఆ టాయిలెట్‌లోకి వెళ్లిన వ్యక్తి బేసిన్‌లో ఇరుకున్న పిండాన్ని చూసి ఆసుపత్రి సిబ్బందికి చెప్పారు. 
 
ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో వారు అక్కడకు వచ్చిన విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఇది మైనర్‌ బాలిక పనిగా గుర్తించారు. ఆమెను దీనిపై ప్రశ్నించగా ఆరు నెలల కిందట 20 యేళ్ళ వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడటంతో గర్భం దాల్చినట్లు తెలిపింది.
 
ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని బోరున విలపిస్తూ చెప్పింది. దీంతో బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వయనాడ్‌కు చెందిన నిందితుడిని గురువారం అరెస్టు చేసి కొచ్చికి తీసుకొచ్చారు. పోక్సో కోర్టులో అతడ్ని ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.