గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (08:32 IST)

భర్తను చంపి ముక్కలు చేసిన భార్య - శరీర భాగాలు కరిగేందుకు కెమికల్స్‌ పోసి...

ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తన చంపేసింది. ఆ శవాన్ని మాయం చేసేందుకు ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఈ ముక్కలను కరిగించేందుకు కెమికల్స్‌లో నాన బెట్టింది. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ నగరంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముజఫర్‌పూర్‌లోని సికందర్‌పూర్ నగర్ ప్రాంతానికి చెందిన రాధ అనే వివాహిత తన ప్రియుడు సుభాష్, సోదరి రాధలతో కలిసి తన భర్త 30 ఏళ్ల రాకేష్‌ను హతమార్చింది. 
 
భర్త మృతదేహాన్ని వదిలించుకోవడానికి దాన్ని ముక్కలుగా చేసి ఆ ముక్కలను కెమికల్‌లో వేసి కరిగించేందుకు ప్రయత్నించారు. దీంతో కెమికల్ వాడకంతో పేలుడు సంభవించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ఫ్లాట్ లోపల చెల్లాచెదురుగా ఉన్న మృతదేహం ముక్కలు కనిపించాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఫోరెన్సిక్ బృందం దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ మృతదేహం రాధా భర్త రాకేశ్‌గా గుర్తించారు. 
 
బీహార్ రాకేశ్ అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నాడు. దీంతో పోలీసులకు భయపడి ఇంటికి రావడం మానేశాడు. ఈ క్రమంలో రాధను రాకేష్ భాగస్వామి అయిన సుభాష్ చూసుకునే వాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. 
 
అయితే, ఇటీవల భర్తను ఇంటికి పిలిపించిన రాధ.. తన ప్రియుడు సుభాష్‌, చెల్లెలు, తల్లి సహాయంతో చంపేసింది. మృతుడి సోదరుడు దినేష్ ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.