సంబంధిత వార్తలు
- వైఎస్.వివేకా హత్య కేసులో టర్నింగ్ పాయింట్ : అతని అరెస్టుకు రంగం సిద్ధం
- ఊపిరి పీల్చుకున్న ఏపీ సీఎం జగన్.. బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
- వివేకా హత్య కేసు: సీబీఐ అధికారుల సీన్ రీకన్స్ట్రక్షన్
- వివేకా హత్య కేసు : మిస్టరీ వీడినట్టేనా.. హంతకులు వారిద్దరేనా?
- సీబీఐకు కోర్టు లాస్ట్ ఛాన్స్... నేను హాజరుకాలేనంటున్న సీఎం జగన్
కొనసాగుతున్న వివేకా హత్య కేసు : పులివెందుల కోర్టులో శంకర్ రెడ్డి?
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. ఈ కేసులో అరెస్టు అయిన ఉమా శంకర్ రెడ్డిని అధికారులు మూడో రోజు విచారిస్తున్నారు. ఈ హత్యకేసుతో సంబంధం ఉన్నమరో ఇద్దరు నిందితులు అధికారుల ముందు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వైఎస్ వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా సీబీఐ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది.
ఇదిలావుంటే, సోమవారం ఉమా శంకర్‌రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా విచారణ కోసం సింహాద్రిపురం మండలం సుంకేశుల గ్రామానికి చెందిన సోమశేఖర రెడ్డి, పులివెందులకు చెందిన వెంకటనాథ్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు.
తర్వాతి కథనం
