ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (08:12 IST)

సీబీఐకు కోర్టు లాస్ట్ ఛాన్స్... నేను హాజరుకాలేనంటున్న సీఎం జగన్

కేసుల విచారణకు తాను స్వయంగా హాజరుకాలేనని అందువల్ల తన తరపున న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
అదేసమయంలో పెన్నా ఛార్జిషీట్‌లో జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోమారు గడువు కోరింది. పెన్నా సిమెంట్స్‌పై కౌంటరుకు చివరి అవకాశం ఇస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది.
 
కాగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు కఠువుగా వ్యాఖ్యానించింది. జగన్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐకి ఇదే చివరి అవకాశమని తెలిపింది. పెన్నా కేసులో విజయసాయి రెడ్డి, సబిత, శామ్యూల్, రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.
 
మరోవైపు అరబిందో, హెటిరో కేసుల వాదనలు వినిపించేందుకు కోర్టును ఈడీ గడువు కోరింది. నిందితులు కూడా వాదనలకు సిద్ధం కావాలని కోర్టు స్పష్టం చేసింది. తన బదులు న్యాయవాది హాజరుకు అనుమతి ఇవ్వాలని జగన్‌ న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్​పై ఈ నెల 13 విచారణ జరుపనుంది.