గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:54 IST)

ఏపీ సీఎం జగన్‌తో సమావేశమైన హీరో మంచు మనోజ్

తెలుగు నటుడు మంచు మనోజ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇటీవల తెలంగాణ మంత్రుల‌తో భేటి కాగా, ఈ భేటిలో మనోజ్ కుమార్ అడ్వెంచర్ టూరిజంతో పాటు వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తన అభిమాప్రాయాలను మంత్రులు, ఉన్నతాధికారులతో పంచుకున్నారు.
 
ఇక మంచు మ‌నోజ్ తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటి అయ్యారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసిన మనోజ్.. "సీఎం జ‌గ‌న్‌ని క‌ల‌వ‌డం గౌరవంగా భావిస్తున్నాను. భ‌విష్య‌త్ కోసం ఆయ‌న చేస్తున్న ప్ర‌ణాళిక‌లు, ముందు చూపు, దూర‌దృష్టి న‌న్ను బాగా ఆకర్షించాయి. రాష్ట్ర అభివృద్ది ప‌ట్ల ఆయ‌న‌కున్న దార్శ‌నిక‌త న‌న్ను ముగ్ధుడిని చేసింది. మంచి ప‌నులు చేస్తున్న మీలాంటి వారికి దేవుడి శుభాకాంక్ష‌లు ఉండాల‌ని కోరుకుంటున్నాను" అని మ‌నోజ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.