మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (11:54 IST)

అప్పుల ఊబిలో ఏపీ.. ఎకనామిక్ అడ్వైజర్‌గా రజనీశ్‌కుమార్‌‌

ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌ సర్కార్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ అప్పుల, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కోసం మరో సలహాదారుగా రజనీశ్‌ కుమార్‌‌ను నియామకం చేసింది జగన్‌ సర్కార్‌. గురు గ్రామ్‌‌కు చెందిన ఆర్థిక నిపుణుడు రజనీశ్‌కుమార్‌‌ను కేబినెట్‌ ర్యాంకుతో నియమిస్తున్నట్లు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఇక ఈ పదవిలో రెండేళ్లు పాటు కొనసాగనున్నారు రజనీశ్‌ కుమార్‌. ఆర్థిక వనరుల సమీకరణ కు ఇప్పటికే విశ్రాంత ఐఏఎస్‌ అధికారి సుభాష్‌ చంద్ర గార్గ్‌ను సలహాదారుగా నియమించింది ఏపీ ప్రభుత్వం. ఢిల్లీ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు గార్గ్. 
 
అలాగే… కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుడిగా ఆర్ పి ఠాకూర్‌ కూడా నియమించింది ఏపీ సర్కార్‌. రాష్ట్ర కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుడిగా మాజీ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ ను నియమిస్తూ ఈ మేరకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్త ర్వులు జారీ చేశారు. ఇక ఠాకూర్‌ టీడీపీ హయాంలో డీజీపీగా పనిచేశారు.