గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (14:08 IST)

బోగస్ చలాన్ల కుంభకోణం.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం

బోగస్ చలాన్ల కుంభకోణం నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ తరహాలోనే మరి కొన్ని శాఖల్లోనూ అంతర్గత తనిఖీలు చేయాలని నిర్ణయం తీసుకుంది సర్కార్‌. 
 
ప్రజలు చెల్లించే చలానాల నగదు సీఎఫ్ఎంఎస్‌కు చేరేందుకు జాప్యం జరుగుతోందని గుర్తించిన అధికారులు జాప్యం కావడం వల్లే అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోందని అభిప్రాయపడుతున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో అంతర్గత తనిఖీలు కొనసాగుతున్నాయి. 
 
ఇప్పటివరకు 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ. 8.13 కోట్ల నిధులు గోల్ మాల్ అయినట్టు వెల్లడించారు అధికారులు. అలాగే… రూ. 4.62 కోట్ల మేర రికవరీ అయినట్లు… 14 మంది సబ్ రిజిస్ట్రార్ల మీద చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.