గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (14:05 IST)

అధికారులను పరుగులు పెట్టించిన సర్పంచ్ లేఖ

తమ గ్రామానికి వచ్చే రోడ్డు అధ్వాన్నంగా ఉందనీ దాన్ని రిపేర్ చేయించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓ గ్రామ సర్పంచ్ లేఖ రాశారు. ఈ లేఖతో అధికారులు పరుగులు పెట్టారు. ఆగమేఘాలపై రహదారికి మరమ్మత్తులను చేయించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో చోటు చేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పి.గన్నవరం మండలంలోని గంటి పెదపూడి నుంచి గన్నవరం వరకు రోడ్లు వేయాలని బెల్లంపూడి సర్పంచ్ బండి మహాలక్ష్మి కోరారు. ఈ మార్గంలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.. గుంతలతో తరచుగా ప్రమాదాలు జరిగినట్టు ఆమె పేర్కొంటూ సీఎం జగన్‌కు ఓ లేఖ రాశారు. 
 
ఈ లేఖపై సీఎంఓ తక్షణం స్పందించింది. రోడ్ల మరమ్మత్తులకు కావాల్సిన నిధులను రిలీజ్ చేసింది. దీంతో పి.గన్నవరం నుండి గంటి పెద పూడి వరకు వెళ్లే రహదారి మరమ్మతులను అధికారులు చేపట్టారు. అంతేకాదు త్వరలోనే టెండర్లు వేసి రోడ్లు నిర్మిస్తామని సర్పంచ్ మహాలక్ష్మికి అధికారులు తెలిపారు.