మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (06:12 IST)

ఏపీకి అకౌంటెంట్‌ జనరల్‌ లేఖాస్త్రాలు.. ఎందుకో తెలుసా?

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ, అప్పులు, బడ్జెట్‌, ఆఫ్‌ బడ్జెట్‌ వ్యయంపై అకౌంటెంట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వరుసగా లేఖాస్త్రాలు సంధించడంతో రాష్ట్ర ఆర్థికశాఖ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఒక్క రోజునే రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఏకంగా నాలుగు లేఖలు రాయడం వెనుక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేంద్రప్రభుత్వం తన రాజకీయ ప్రయోజ నాల కోసం ఇలా చేయిస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ప్రధానంగా ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌పై ఎజి కార్యాలయం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇరదులో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలకు ఆర్థికశాఖ ఇచ్చిన గ్యారంటీల వివరాలు చెప్పాలని ఎజి కార్యాలయం కోరింది. ఏ సంస్థ ఎంత రుణం తీసుకుంది, అందుకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ వివరాలు, ఆ రుణాన్ని ఇచ్చిన బ్యాంకు లేదా ఆర్ధిక సంస్థ వివరాలు, అందుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీలు ఇవ్వాలని పేర్కొంది.

ఈ రుణాల ద్వారా సేకరించిన నిధులతో చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వంపై దాని ప్రభావం వంటి అంశాలపైనా ఆరా తీస్తోంది. అలాగే రాజధాని నిర్మాణంలో ప్రాధాన్యతాపరంగా కొన్ని పనులు చేపట్టేందుకు సిఆర్‌డిఎ తీసుకున్న మూడు వేల కోట్ల రుణంపైనా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ రుణాన్ని ఏ బ్యాంకుల నుంచి సేకరించారు, ఎలా ఖర్చు చేశారు, ఈ రుణా నికి సంబంధించి గ్యారంటీ ఒప్పందాల వివరాలు చెప్పాలని కోరినట్లు సమాచారం.