సంబంధిత వార్తలు
- పెళ్లి మండపం నుంచి వధువు పరార్..
- భార్య ఖాతాలో భర్త రూ. 39 లక్షలు డిపాజిట్, తిరిగి వచ్చేసరికి డబ్బుతో సహా ప్రియుడితో జంప్
- ఛీ..ఛీ. తాలిబన్లు మీరు మనుషులేనా? 15 యేళ్ళ బాలికల కోసం ఇంటింటికి తిరుగుతున్నారట
- బుల్లెట్టు బండి వధువు బంపర్ ఆఫర్.. నెక్ట్స్ పాటకు ఆమెదే డ్యాన్స్?
- ప్రేమించి గర్భవతిని చేశాడు.. పదేళ్ల తర్వాత తిరిగొచ్చాడు.. ఏమైందంటే?
ఐదు లక్షల బంగారం, రెండు లక్షల నగదుతో ప్రియుడి బైక్ పైన వధువు జంప్
మరికాసేపట్లోనే పెళ్ళి. ఇక మండపంలోకి పెళ్ళి కూతుర్ని తీసుకు రావాల్సిన సమయం. ఆమెను తీసుకురండి అన్నాడు పండితులు. మంత్రాలు చదువుతూ ఉండడం.. పెళ్ళి సందడి నెలకొంటే ఇంతలో గట్టిగా అరుపులు. పెళ్ళి కూతురు గదిలో లేదని...
చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె మండలం బురుజుపల్లెకు చెందిన ఒక యువతికి పెళ్ళి నిశ్చయించారు. ఈ నెల 7వ తేదీన నిశ్చితార్థం కూడా జరిగింది. వరుడు ఉన్న ప్రాంతం అనంతపురం జిల్లా పూలుకుంట మండలం కమ్మలవారి బురుజు. వివాహం కోసం అనంతపురం నుంచి నిన్న వచ్చారు.
కట్నం ఇచ్చేందుకు పెళ్ళికూతురు తండ్రి 2 లక్షల రూపాయలు తెచ్చిపెట్టాడు. పెళ్ళి కూతురు ఒంటిపై ఐదు లక్షల రూపాయల విలువ చేసే నగలు కూడా ఉన్నాయి. మరో గంటలో పెళ్ళి అనగా చీర మార్చుకుని రమ్మని పెద్దలు చెప్పారు. అంతే గదిలోకి వెళ్ళిన పెళ్ళి కూతురు కనిపించకుండా పోయింది. నగలు, నగదును తీసుకుని వెళ్ళిపోయినట్లు బంధువుల గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్థానికంగా ఉన్న సి.సి. ఫుటేజ్‌లో పరిశీలించగా ఒక యువకుడితో కలిసి ఆమె మోటారు సైకిల్ పైన వెళుతుండగా పోలీసులు గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వరుడు లబోదిబోమంటూ అనంతపురం వెళ్ళిపోయారు.
తర్వాతి కథనం
