1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. bride escaped from marriage hall in chitoor

పెళ్లి మండపం నుంచి వధువు పరార్..

bride
పెళ్లి మండపం నుంచి వధువు పరారైన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా ఎన్‌పీకుంట మండలం బలిజపల్లెకు చెందిన యువకుడు (26)కి తంబళ్లపల్లె మండలం కొటాల పంచాయతీ పరిధిలోని గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. 
 
వివాహం జరగాల్సి ఉండడంతో మదనపల్లె చేరుకున్న వధూవరుల కుటుంబ సభ్యులు అమ్మచెరువు సమీపంలోని కల్యాణ మండపంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు.
 
ఇక మంగళవారం రాత్రి వధూవరులకు నలుగుపెట్టారు. ఈ తంతు పూర్తయిన తర్వాత రాత్రికి రాత్రే కుటుంబ సభ్యుల కళ్లుగప్పి వధువు పరారైంది. 
 
విషయం తెలిసిన ఇరు కుటుంబాల సభ్యులు షాక్‌కు గురయ్యారు. మరోవైపు, తనకు అవమానం జరిగిందంటూ వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా, వధువు మైనర్ అని తేలింది. దీంతో దర్యాప్తు చేపట్టారు.
తర్వాతి కథనం
కండోమ్ లేదు.. జిగురుతో పాటు వైట్‌నర్‌ రాసుకున్నాడు.. చివరికి?