నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా బా పాటకు వధువు డ్యాన్స్.. వరుడు ఫిదా
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా బా అనే యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ పొందింది. రచయిత లక్ష్మణ్ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు.. ఎస్కే బాజి సంగీతం అందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైన పాట ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకోగా ఇక లైక్‌లు లక్షల్లో.. షేర్లు, కామెంట్లు వేలల్లో వస్తున్నాయి.
అచ్చమైన తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఒక్క యూట్యూబ్‌లోనే కాదు బయట కూడా మార్మోగుతోంది. ఈ పాట ఎక్కడకి వెళ్లినా బుల్లెట్ బండి పాట వినిపిస్తోంది. ప్యాసింజర్ ఆటోల నుంచి టీస్టాల్, దాబా ఇలా ఎక్కడైనా ఆ పాటనే హల్ చల్ చేస్తోంది.
ఈ క్రమంలోనే వివాహ వేడుక అనంతరం తీసిన బరాత్‌లో వధువు ఈ పాటకు డ్యాన్స్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. తాజాగా ఓ వధువు తన పెళ్లి తర్వాత జరిగిన బరాత్‌లో ఆ పాటకు లయ బద్దంగా కాలు కదుపుతూ చూపరులను ఆకట్టుకుంది.
వధువు స్టెప్పులకు ఫిదా అయిన భర్త అలా చూస్తుండి పోయాడు. అయితే వధువు ఏదో ఒక్క స్టెప్పు వేసి ఊరుకోలేదు.. పాట పూర్తిగా అయిపోయేవరకు తన నృత్యంతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.