గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (18:57 IST)

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ముగిసినట్లే: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్

తెలంగాణలో కరోనా చాలా వరకు నియంత్రణలోకి వచ్చిందన్నారు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా రెండవ వేవ్ ముగిసినట్లేనని ఆయన వెల్లడించారు. అన్ని జ్వరాలను కరోనా కారణంగా వచ్చే జ్వరంగా భావించవద్దని సూచించారు. 
 
వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని... అయితే ఈ వ్యాధులు పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దోమలు, లార్వా అభివృద్ధి చెందకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొన్ని జిల్లాల్లో మలేరియా కేసులు అధికంగా వస్తున్నాయని తెలిపారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.65 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించామని శ్రీనివాస రావు తెలిపారు. 56 శాతం మందికి ఫస్ట్  డోస్, 34 శాతం మందికి రెండో డోస్ పూర్తయిందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఏరియాలో 90 శాతం మంది ప్రజలకు మొదటి డోసు వేశామని తెలిపారు.