శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (18:03 IST)

ఒక్క రాత్రి కోసం యాభై లక్షలయినా పర్లేదా? ఏం చెప్ప‌ద‌లిచారు క్రేజీ అంకుల్స్?

Crazy Uncles Trailer
మహిళలను కించ పరిచే విధంగా రూపొందించిన క్రేజీ అంకుల్స్ సినిమా విడుదలను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ మహిళ హక్కుల వేదిక అధ్యక్ష కార్యదర్శులు రేఖ, రత్నాలు డిమాండ్ చేశారు, ఈ మేరకు బుధవారం సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తాజాగా విడుదలకి సిద్దనగా ఉన్న క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్ లోనే మహిళలను కించ పరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు,మహిళ లను ఆట వస్తువుగా చూపిస్తూ, అసభ్య  పదజాలంతో కూడిన సినిమా రూపిందించడం సరికాదు అన్నారు,
 
కేవలం ట్రైలర్లోనే అంత అసభ్యత ఉంటే ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో ఊహించవచ్చు అన్నారు, గతంలో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయని, కేవలం డబ్బు సంపాదన కోసమే యావత్ మహిళ జాతిని కించపర్చడం అన్యాయమన్నారు. వెంటనే సినీ నిర్మాత, దర్శకులు, నటీనటులు యావత్ మహిళ లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పి సినిమా విడుదలను నిలిపివేయాల‌ని హెచ్చరించారు. లేకుంటే యావత్ తెలుగు రాష్ట్రాల మహిళ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని చెప్పారు.
 
అస‌లు క్రేజీ అంకుల్ వివాదం కార‌ణ‌మైన అంశాలను వారు ఈవిధంగా విశ్లేషించారు
 
- భార్యలు చూడడానికి తప్ప‌, ఎక్కడానికి  పనికిరారు అనేడైలాగ్ ఉంది ట్రయిలర్లో అంటే వీళ్ల ఉద్దేశ్యం భార్యలను అవమానించడమా? సగటు మహిళలు దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి?? సంసారం చేసే మహిళల పట్ల ఇలాంటి డైలాగులు చేయడం ఎంతవరకు న్యాయం.
 
- హీరోయిన్ల కంటే వాళ్ల మేనేజర్లు, పీఏల సంపాదనే ఎక్కువ ఉంటుంది. అంటే, ఇండస్ట్రీ అంతగా చెడిపోయిందనుకోవాలా.? మరోసారి మీటూ ఉద్యమాన్ని గుర్తుకు తెస్తున్నారా? గతంలో మేనేజర్లే  హీరోయిన్లను కమిట్మెంట్ అడిగేవారని పలువురు వ్యాఖ్యానించారు. దీనిని ఎలా చూడాలి..? ఈ డైలాగులు తీసేయాలి..?. సెన్సార్ ఎలా అనుమతించింది ఇలాంటి డైలాగులని??
 
- బడా నిర్మాత బండ్ల గణేశ్ స్వయంగా ఈ డైలాగ్ చెబుతున్నాడు. అంటే ఆయన సినిమాలలో ఇలాంటివి ఎంకరేజ్ చేస్తాడా.?? ఆయన రాజకీయ నాయకుడిగా కూడా మారాడు.. సమాజానికి ఆయన చెప్పే నీతులు ఇవేనా..??
 
- సింగర్ మనో గారంటే ఇప్పటిదాకా అభిమానం ఉంది. ఎస్పీ బాలుగారి తర్వాత తెలుగుపాటకి పెద్ద దిక్కుగా అవుతారని భావించాం.. కానీ, ఆయన బూతులకి పెద్ద దిక్కుగా మారేలా కనిపిస్తున్నారు. అడల్ట్ కామెడీ షోగా ముద్రపడిన జబర్దస్త్ లో ఆయన చేసే డైలాగులు అన్నీ చూస్తున్నాం. ఇలాంటి పాత్రలు ఆయన ఎలా చేస్తారు..??
 
- ఒక్క రాత్రి కోసం 50 లక్ష రూపాయలు ఖర్చు అయినా పర్లేదు.. ఎవరండీ ఈ డైలాగులు రాసింది..  మహిళలను భోగవస్తువుగా చూపిస్తారా..? ఇప్పటికే మహిళలపై సమాజంలో జరుగుతున్న అకృత్యాలు, అరాచకాలు చూడడం లేదా ఈ దర్శకనిర్మాతలు హీరోలకి.. ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే అవి మరింతగా పెరగవా..??
 
- ఈ సినిమా నిర్మాతలు గతంలో ఈరోజుల్లో అనే సినిమా తీశారు..అది బూతు సినిమాగా పేరు తెచ్చుకుంది. దర్శకుడు మారుతి ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు.. ఆయనకు కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది. మరో మారుతిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటున్నారా ?. ఈరోజుల్లో లాంటి బూతు సినిమాలను తీసి వదులుతారా..? 
 
- బాలీవుడ్లో రాజ్ కుంద్రా సీక్రెట్‌గా అడల్ట్ కంటెంట్ తీస్తే… ఇలాంటి నిర్మాతలు డైరెక్ట్‌గా ముసుగులో ఇలాంటి బూతు సినిమాలు పబ్లిక్ గా తీసి రిలీజ్ చేస్తారా..?? 
 
- ఈ గుడ్ఫ్రెండ్స్ నిర్మాతలు తమ బ్యానర్‌కి గుడ్ అని పేరు పెట్టుకొని.. తీసే సినిమాలు మాత్రం నీచమైనవి తీస్తారా..? సినిమాని 19వ తేదీన విడుదల చేయనీయం.. ధర్నాలు చేస్తాం.. మహిళల గౌరవం కాపాడతాం.. 
 
- ఎవరండీ ఈ గుడ్ ఫ్రెండ్స్.. బ్యానర్లో తప్ప.. వీరి సినిమాలలో ఎక్కడా గుడ్ కనిపించడం లేదు.. ఈ బ్యానర్ ని ముందు బ్యాన్ చేయాలి…. 
 
- దర్శకుడు ఈ. సత్తిబాబుకి మంచి పేరుంది. ఇప్పటిదాకా ఆయన ఫ్యామిలీ కలిసి కూర్చునే కామెడీ పండించాడు. తాజాగా ఆయన అడల్ట్ కామెడీ చేస్తున్నాడు.. ఆయన జబర్దస్త్ లాంటి షోలని డైరెక్ట్ చేసుకోమని చెప్పండి.. ఇలాంటి సినిమాలు తీసి సమాజాన్ని చెడగొడతారా..?