శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (10:28 IST)

ఆప్ఘన్‌లో చిక్కుకున్న తెలంగాణా వాసులు

తాలిబన్ల వశమైన ఆఫ్గనిస్థాన్‌లో పలువురు తెలుగు ప్రజలు చిక్కుకున్నారు. ముఖ్యంగా తెలంగాణా వాసులు ఇక్కడ చిక్కుకునిపోయారు. వీరిని రాష్ట్రానికి తీసుకొచ్చేందు ప్రభుత్వాలు సహకరించాలని బాధితుల కటుంబాలు కోరుకున్నారు. 
 
ప్రస్తుతం ఆప్ఘాన్‌లో తెలంగాణవాసులు బొమ్మెన రాజన్న, వెంకటయ్య చిక్కుకున్నారు. తమతో పాటు మరో 14 మంది భారతీయులు  ఉన్నారని బాధితులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
 
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలకు చెందిన బొమ్మెన రాజన్న.. 8 ఏళ్లుగా కాబుల్‌లోని ఏసీసీఎల్‌లో పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఇంటికి వచ్చిన రాజన్న.. తిరిగి ఈ నెల 7న కాబుల్‌కు వెళ్లారు. 
 
అయితే, ఆఫ్ఘనిస్తాన్‌.. తాలిబన్ల ఆక్రమణకు గురి కావడంతో అక్కడి ప్రజలు ఇతర దేశాలకు పారిపోతున్నారు. ఈ క్రమంలో తెలుగు బాధితులు అక్కడ చిక్కుకున్నారు. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని స్వదేశానికి రప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుఉన్నారు.