శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (10:21 IST)

ఇమ్రాన్​ఖాన్​కు కూతుర్లు ఉండి తీరాల్సింది : తస్లీమా విమర్శలు

Taslima
ఇస్లాంను విమర్శించి ఫత్వా ఎదుర్కొంటున్న ఈ బంగ్లాదేశ్ రచయిత్రి 25 ఏళ్లుగా ప్రవాస జీవితం గడుపుతున్నారు. ఎప్పుడో తప్ప వార్తల్లోకి ఎక్కని తస్లీమా తాజాగా ఆప్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల చర్యలపై విమర్శలు గుప్పిస్తోంది. అక్కడి మహిళలను రక్షించండని కోరుకుంటోంది. ట్విటర్ వేదికగా తన గళాన్ని వినిపిస్తోంది. అయితే తన మాటల పదునును ఈసారి పాకిస్తాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​పై ఉపయోగించింది. 
 
తాలిబన్ల విషయంలో ఇమ్రాన్​ వైఖరిని తస్లీమా తప్పుబట్టింది. పాకిస్తాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​కు కూడా కొడుకుల బదులు కూతుర్లు ఉండి తీరాల్సిందని అన్నారు. ఆ కూతర్లు కూడా ఎక్కడో యూకేలో కాకుండా ఆప్ఘనిస్తాన్​లో ఉండి ఉంటే బాగుండేదని ఆమె విమర్శలు గుప్పించారు.
 
తాలిబన్లు సైనిక సంస్థ కాదని, సామాన్య పౌరులేనని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పాక్‌ సరిహద్దుల్లో 30 లక్షల మందికి పైగా ఆప్గాన్‌ శరణార్ధులు ఉన్నారని....వారిని ఎలా తుదముట్టించాలని కోరుతానని ప్రశ్నించారు. 
 
మంగళవారం రాత్రి ఓ న్యూస్‌ చానల్​తో ఆయన మాట్లాడుతూ... ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు అక్కడ 5 లక్షల మందితో కూడిన శిబిరాలు ఉన్నాయని, తాలిబన్లు సైనిక సంస్థ కాదని, వారు సాధారణ పౌరులేనని పేర్కొన్నారు. 
 
ఈ శిబిరాల్లో కొంత మంది పౌరులు ఉంటే... పాకిస్తాన్‌ వారిని ఎలా తుదిముట్టిస్తుందని, వాటిని అభయారణ్యాలుగా ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఆప్ఘనిస్తాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటంలో తాలిబన్లకు సైనిక,ఆర్థికపరమైన సాయాన్ని పాక్‌ అందిస్తోందన్న వార్తలను ఆయన ఖండించారు. ఆప్గనిస్తాన్‌లో అమెరికాతో యుద్ధం జరిగే సమయంలో పాకిస్తాన్‌కు చెందిన వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.