1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Fire Accident in Korutla Shopping Mall

కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం.. ఆనంద్ షాపింగ్ మాల్ దగ్ధం

Fire Accident
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్థానిక ఆనంద్ షాపింగ్‌మాల్‌లో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, అవి ఎగసిపడుతూ క్రమంగా భవనం మొత్తం వ్యాపించాయి. 
 
ఈ మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకునే లోపే భవనంలోని నాలుగు అంతస్తులకు మంటలు ఎగబాకాయి. షాపింగ్‌మాల్‌లోని సామగ్రి మొత్తం కాలిబూడిదైంది.
 
మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో వాటిని అదుపు చేయడం కష్టమైంది. మంటలు అదుపులోకి రావడానికి చాలా సమయం పట్టడంతో మాల్‌ కాలిబూడిదైంది. భారీ ఆస్తినష్టం సంభవించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తర్వాతి కథనం
కోవిషీల్డ్ టీకా వేయాలని కోర్టుకెక్కిన కేరళ వ్యక్తి: కుదరదన్న కేంద్రం