1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (17:28 IST)

బుధవారం 11 గంటలకు టి సెట్-2021 ఫలితాలు

తెలంగాణా రాష్ట్రంలో ఈసెట్ -2021 ప్రవేశ పరీక్షా ఫలితాలను బుధవారం వెల్లడించనున్నారు. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ టీ పాపిరెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు కూకట్‌పల్లి జేఎన్‌టీయూ క్యాంపస్‌లో విడుదల చేయనున్నారు. 
 
ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి అధికారి వెబ్‌సైట్‌ ecet.tsche.ac.in నుంచి విద్యార్థులు ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన మంగళవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈనె 3వ తేదీన TS ECET-2021 ప్రవేశ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించిన విషయం తెల్సిందే.