సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (21:17 IST)

మౌంట్‌ యునాన్‌ పర్వతాన్ని తెలంగాణా కానిస్టేబుల్

తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఓ కానిస్టేబుల్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. కరీంనగర్‌ జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌శాఖలో పని చేసే కానిస్టేబుల్ లెంకల మహిపాల్‌ రెడ్డి లఢఖ్‌లోని మౌంట్‌ యునాన్‌ పర్వత శిఖరాన్ని అధిరోహించి జాతీయ జెండాను ఎగురవేశాడు. 
 
ఈ నెల 8న మనాలి నుంచి మౌంట్‌ యునామ్‌ (6111) మీటర్ల పర్వతారోహణకు 15 మంది సభ్యుల బృందం వెళ్లగా, అందులో మహిపాల్‌ రెడ్డి కూడా ఉన్నారు. ఈ బృందం సభ్యులు ఈ నెల 15న స్వాతంత్ర్యం దినోత్సవం రోజు పర్వతారోహణను విజయవంతంగా పూర్తి చేసింది. 
 
అనంతరం అక్కడ జాతీయ పతకాన్ని పర్వతంపై అవిష్కరించారు. వీటికి గాను ఆయనకు గిన్నిస్‌ రికార్డుతో పాటు హై రేంజ్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు సంపాదించుకున్నట్లు మహిపాల్‌ రెడ్డి వెల్లడించారు.