శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 12 మార్చి 2021 (16:29 IST)

జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య కుటుంబానికి సీఎం జగన్ రూ. 75 లక్షల సాయం

భారతదేశం మువ్వన్నెల జాతీయ పతాకం సృష్టికర్త పింగళి వెంకయ్య. ఆయన కుటుంబానికి ఏపీ ప్రభుత్వం భారీ ఆర్థికసాయాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి రూ.75 లక్షలు సాయం చేయాలని శుక్రవారం ఉత్తర్వులను సైతం జారీ చేసింది.
 
ఆజాదీకా అమృత్ మహోత్సవాల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని ఆమె నివాసంలో కలిశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్న సీఎం ఆర్థిక సాయం ఉత్తర్వులను ఆమెకు అందజేసి నగదును ఖాతాలో జమ చేయించారు.
 
కాగా భారతదేశ జాతీయ పతాకం రూపొందించి మార్చి 31 నాటికి వందేళ్లు పూర్తి కానున్న సందర్భంగా పింగళి కుమార్తెను సీఎం సత్కరించినట్లు సీఎంఓ ప్రకటనలో తెలిపింది.