నీతిగల నాయకుడి బయోపిక్!
రాజకీయాలు, సినిమాలు రెండూ పెనవేసుకుపోయాయి. ఏ కథ చెప్పినా అందులో రాజకీయనాయకుడి గురించో మరో మహానుభావుడి గురించే వుంటుంది. ఇక సినిమా వాళ్ళ బయోపిక్‌లు కొందరివి వచ్చాయి. సావిత్రి, ఎన్.టి.ఆర్. రాజశేఖర్‌రెడ్డి ఇలా కొందరికి వచ్చాయి. అయితే ఇప్పుడు ఎవరికీ తెలీని ఓ రాజకీయ నాయకుడి జీవితాన్ని బయోపిక్‌గా తీసుకురావాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు చాలా రోజులుగా కసరత్తులు జరగుతూనే వున్నాయి.
ఆయనే ఇల్లెందు సిపిఐ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక శాసనసభ సభ్యుడు గుమ్మడి నరసయ్య. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండే సిపిఐ పార్టీ తన వైఖరిని మార్చుకుని మొదటిసారిగా 1983లో ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. అలా ఐదు పర్యాయాలు ఆయన గెలిచారు. ఆయన నిగర్వి, నిజాయితీపరుడు. సైకిల్‌పైనే ఎక్కడికైనా వెళ్ళేవాడు. ఎం.ఎల్.ఎ. తనకు వచ్చిన డబ్బులతో ప్రజలకు సేవచేసేవాడు.
అలాంటివారి బయోపిక్‌కోసం వారికి బాగా తెలిసిన వ్యక్తో, పార్టీకి చెందిన వారుగానీ బయోపిక్‌కు సిద్ధం చేస్తున్నారు. ఫిలింనగర్‌లో ఈ వార్త రన్నింగ్‌లో వుంది. గత కొత్త కాలంగా ఈ సినిమాకు సంబంధించిన కథను రూపొందిస్తున్నారని పరమేశ్వర్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాని తెలుస్తుంది.
ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ నిజమైన నాయకుడి గురించి ఇప్పటి యువతకు అలాగే రాబోయేతరల నాయకులకు తెలియాలనే ఈ బయోపిక్ తీయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి ఈరోజుల్లో ఆయన గురించి చాలామంది తెలీదు. అలాంటి బయోపిక్ వల్ల పార్టీకి ఏమైనా వుపయోగం వుంటుందోమని సి.పి.ఐ.వారు భావిస్తుంటే అసలు పార్టీ వుందాలేదో తెలీని స్థితిలో వున్న సి.పి.ఎం.వారు మౌనం వహిస్తున్నారు. చాలాసార్లు సుందరయ్యగారి జీవితాన్ని సినిమాగా తీయాలని అప్పట్లో పలువురు భావించినా అందుకు తగిన న్యాయం చేసేవారు లేక అటకెక్కింది.