మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (17:42 IST)

సిల్క్‌స్మిత బయోగ్రఫీలో అనసూయ కాదు.. శ్రీరెడ్డి నటిస్తుందట

Sri Reddy
దివంగత నటి సిల్క్‌స్మిత బయోగ్రఫీలో యాంకర్ అనసూయ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. కొన్ని ఫోటోలు కూడా అనసూయ సిల్క్‌స్మితగా కనిపించనున్నట్లు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా సిల్క్‌స్మిత బయోగ్రఫీలో తాను హీరోయిన్‌గా నటించన్నట్టు శ్రీరెడ్డి తాజాగా ప్రకటించింది. ఈ ప్రకటనతోపాటు సిల్క్‌స్మితతో తను పోల్చుకుంటూ ఓ ఫోటోను కూడా విడుదల చేసింది. 
 
ఈ చిత్రానికి అనేక వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించిన మధు దర్శకత్వం వహించనున్నట్టు ఆమె తెలియజేసింది. ఈ చిత్రం గురించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆమె ప్రకటించింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. మధు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ప్రకంపనలు సృష్టించిన శ్రీరెడ్డి హైదరాబాద్ నుంచి చెన్నైకు మకాం మార్చింది. 2011లో సిల్క్ స్మిత బయోపిక్‌గా రూపొందిన డర్టీపిక్చర్‌లో విద్యాబాలన్ నటించి మెప్పించింది.