1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 జులై 2025 (12:21 IST)

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

Bitter Gourd
Bitter Gourd
చేదుగా వుందని కాకరను వదిలేయకండి. కాకరకాయలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడానికి, మొత్తం రోగనిరోధక పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. 
 
బరువు తగ్గాలనుకునేవారు కూడా తమ డైట్‌లో కాకరకాయను తరచూగా తీసుకోవచ్చు. కేలరీ తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరిచే లక్షణాలు దీనిలో ఉన్నాయి. 
 
వృద్ధాప్య సమయంలో వచ్చే సమస్యలు దూరమవుతాయి. కాకరకాయల్లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను కంట్రోల్ చేస్తాయి. వీటిలో పొటాషియం, ఐరన్ వంటి ఇతర ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉంటాయి.
 
కాకరకాయలోని విటమిన్ సి, ఇతర చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. కాకరకాయ కాలేయాన్ని శుభ్రపరచడానికి, విష పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.