1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 జులై 2025 (17:57 IST)

క్యాబ్‌లో వెళ్తున్న టెక్కీలకు చుక్కలు చూపించిన మందు బాబులు.. ఏం చేశారంటే? (video)

Drunk youths
Drunk youths
ఉప్పల్ వద్ద క్యాబ్‌లో వెళ్తున్న టెక్కీల బృందాన్ని మద్యం మత్తులో ఉన్న గుర్తు తెలియని యువకులు దూకుడుగా వెంబడించడంతో గొడవ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోచారం ఐటీ కారిడార్ నుంచి ఉప్పల్ మీదుగా తార్నాక వైపు క్యాబ్‌లో టెక్కీలు పని ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.
 
ఉప్పల్ 'ఎక్స్' రోడ్డు వద్ద క్యాబ్ డ్రైవర్ కొన్ని వాహనాలకు దారి ఇవ్వడానికి హారన్ మోగించాడని తెలుస్తోంది. దీనితో కోపంగా, మద్యం మత్తులో స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు, క్యాబ్ డ్రైవర్‌తో గొడవపడి దుర్భాషలాడారు.
ఆ దుండగులు అంతటితో ఆగలేదు, స్కూటర్‌పై క్యాబ్‌ను వెంబడించి వారిని భయభ్రాంతులకు గురిచేశారు.
 
ఐటీ ఉద్యోగులు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐటీ ఉద్యోగులపై దాడి చేయడానికి యువకులు పోలీస్ స్టేషన్ వెలుపల నిలబడ్డారు. కానీ పోలీసులు పోలీస్ స్టేషన్ నుండి బయటకు రావడాన్ని చూసి అక్కడి నుండి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.