1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 జులై 2025 (18:30 IST)

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

Heart attack
వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. తెలంగాణలో గుండెపోటుతో విద్యార్ధి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. హనుమకొండలో ఓ 17ఏళ్ల బాలుడు గుండెపోటు మరణించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. హనుమకొండలోని కరుణాపురం గ్రామంలో జ్యోతిబాఫూలే బాలుర గురుకులంలో మణిదీప్‌(17) గుండెపోటుతో మృతి చెందాడు. ఇతను ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మణిదీప్ మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
ఇకపోతే.. గుండెపోటు నుంచి తమను తాము రక్షించుకునేందుకు వారి జీవనశైలిలో మార్పులు తీసుకురావాలని వైద్యులు చెప్తున్నారు. ఇందులో ప్రధాన కారణం రక్త ప్రసరణ తగ్గడం లేదా నిరోధించడం వల్ల గుండెపోటు కేసులు యువతలో తరచుగా కనిపిస్తాయని వైద్యులు చెప్తున్నారు. 
 
తీసుకునే ఆహారంలో నియంత్రణ లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, ఒత్తిళ్లు, ఆందోళన వంటి కారణాల వల్ల గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి.