1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 14 జులై 2025 (17:37 IST)

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Police Hechharika: First ticket launch, Sunny Akhil, Babji, clay poet Belli Yadayya, Belli Janardhana
Police Hechharika: First ticket launch, Sunny Akhil, Babji, clay poet Belli Yadayya, Belli Janardhana
తూలికా  తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్ పై అభ్యుదయ  దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో  బెల్లి జనార్థన్ నిర్మాతగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "పోలీస్ వారి హెచ్చరిక". ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేయగా గజ్వేల్ వేణు  ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. నేడు ఈ చిత్ర తొలి టికెట్ లాంచ్ చేసిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
 
ముఖ్య అతిథి మట్టి కవి బెల్లి యాదయ్య మాట్లాడుతూ, ఈ సినిమాలో ఎందరో సీనియర్ నటీనటులు నటించడం చాలా గొప్ప విషయం. నేను ఎన్నో సంవత్సరాల క్రితం నాటక రంగంలో నటించడం జరిగింది. ఈ సినిమా మా ప్రాంతంలో కొన్ని నిజమైన లొకేషన్స్ లో షూటింగ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుంది" అన్నారు.
 
నటుడు సన్నీ అఖిల్ మాట్లాడుతూ... "నాకు చిన్నప్పటి నుండి సినిమాలపైన ఉన్న ఆసక్తితో ఈ సినిమాలో మంచి పాత్రను పోషించాను. చిన్న వయసులోనే సినిమాను దగ్గర నుండి చూస్తూ ప్రతి విషయంలో దగ్గర ఉంది చూసుకోవడం వల్ల ఎంతో జ్ఞానం లభించింది. దానిని నేను అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
 
నటి జయ వాహిని మాట్లాడుతూ, నేను సాధారణంగా నాటికల ద్వారా ప్రేక్షకులకు పరిచయం. ఎక్కువగా నెగటివ్ రోల్స్ లో నటించడం జరిగింది. ప్రస్తుతం కొన్ని సినిమాలలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నా పాత్ర ఇప్పటి వరకు ప్రేక్షకులు నన్ను చూసిన పాత్రలతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది అన్నారు.
 
నిర్మాత బెల్లి జనార్ధన మాట్లాడుతూ, నేను ఆర్మీలో పని చేసి వచ్చాను. ఒక సినిమాను తెరపై చూపించేందుకు ముందుగా దర్శకులు ఎంతో కష్టపడతారు. నేను, నా భార్య నిర్మాతలుగా సినిమాకు సపోర్ట్ చేస్తూ వచ్చాము. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను" అన్నారు.
 
దర్శకుడు బాబ్జి మాట్లాడుతూ, మట్టి కవి యాదయ్య గారికి మా చిత్ర బృందం తరఫున ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన జనార్ధన్ గారికి, సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక బృందానికి పేరుపేరునా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను గతంలో కూడా జర్నలిస్టుల కోసం ఒక పాటను రాయడం జరిగింది. దయచేసి మీరంతా ఈ సినిమాకు సపోర్ట్ చేసి సినిమాను ప్రేక్షకులలోకి తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. 
 
పోలీస్ వారి హెచ్చరిక మనకు సాధారణంగా బయట కనిపించే సినిమాలు కాకుండా ఈ సినిమా కాస్త భిన్నంగా ఉండబోతుంది. ఈ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ల మధ్య మంచి సన్నివేశాలు ఉండబోతున్నాయి. వారి మధ్య ప్రేమ, పాటలు ఉండబోతున్నాయి. మా చిత్ర టైటిల్ ఇప్పటికే ప్రేక్షకులలోకి బాగా వెళ్ళింది. దానికి పోలీస్ వారికి మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఒక మంచి సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు తెలుపబోతున్నాము. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సమాజం మీద ఒక ప్రేమతో, బాధ్యతతో థియేటర్ నుండి బయటకు వెళ్తారు. మా సినిమాను అందరూ సపోర్ట్ చేయండి" అంటూ ముగించారు.