సంబంధిత వార్తలు
- మటన్ దుకాణానికి సోనూసూద్ పేరు : నేనేమైన సహాయం చేయగలనా?
- కరీంనగర్ జిల్లాలో వింత వ్యాధి: భారీగా నాటుకోళ్లు మృత్యువాత
- బ్రిటన్‌లో పురుడుపోసుకున్న కొత్త స్ట్రెయిన్.. తెలంగాణలో 16 మందికి పాజిటివ్
- రాసలీలల బాగోతం.. బీజేపీ కరీంనగర్ అధ్యక్షుడిపై అధిష్టానం వేటు
- రామగుండంలో పెద్దపులి .. ఆవుల మందపై దాడి.. వణికిపోతున్న స్థానికులు!
KCR దంపతుల అద్భుత చిత్రం- కేటీఆర్, హిమాన్షు హర్షం.. నెట్టింట వైరల్
KCR-Shoba
పెయింటింగ్ అద్భుతంగా ఉందంటూ సంబరపడిపోయారు. పెయింటింగ్ గీసిన వారికి హిమాన్షు థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఆ ఫోటోను హిమాన్షు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణ శోభ చిరునవ్వులు చిందిస్తూ ముచ్చటిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫోటోకు లైకుల వర్షం కురుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. కేసీఆర్ దంపతుల పెన్సీల్ స్కెచ్ పెయింటింగ్‌ను కరీంనగర్‌కు చెందిన కలికోట వెంకటాచారి వేశారు. పెన్సీల్‌తో గీసిన ఈ ఆర్ట్‌ను తొలుత కలికోట వెంకటాచారి ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఆ తరువాత యర్రోజు చందు అనే వ్యక్తి ఆ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్, ఆయన తనయుడు హిమాన్షుకు ట్యాట్ చేస్తూ రీట్వీట్ చేశారు.
దాంతో ఆ పెన్సీల్ ఆర్ట్ కాస్తా హిమాన్షు కంట పడటంతో వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ పెయింట్ అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. ఆ పెయింటింగ్‌ను హిమాన్షు సైతం రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
