సంబంధిత వార్తలు
- బర్డ్ ఫ్లూ: హాఫ్ బాయిల్డ్ గుడ్డు.. ఉడకని చికెన్ వద్దు.. ఎఫ్ఎస్ఎస్ఎఐ
- బర్డ్‌ఫ్లూ దెబ్బకు రాలిపోతున్న కోళ్లు - నిజామాబాద్‌లో 1500 కోళ్లు మృతి
- బర్డ్ ఫ్లూ.. కటక్నాథ్ కోళ్ల ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన ధోనీ... (video)
- బర్డ్ ఫ్లూ: ఈ వైరస్ సోకితే చనిపోతారా? చికెన్ తింటే వస్తుందా? లక్షణాలు ఏమిటి?
- అకారణంగా పక్షులు చచ్చి పడుతున్నాయా? అస్సలు తాకొద్దు, బర్డ్ ఫ్లూ అయి వుండొచ్చు
కరీంనగర్ జిల్లాలో వింత వ్యాధి: భారీగా నాటుకోళ్లు మృత్యువాత
కరీంనగర్ జిల్లాలో వింత వ్యాధి ప్రజలను కలవరపెడుతోంది. చిగురుమామిడి మండలం నవాబ్‌పేటలో భారీగా నాటుకోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో కళేబరాలను గ్రామశివారులో పూడ్చి పెట్టాడు యజమాని. కోళ్ల మృతితో లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఇప్పటికైనా కోళ్ల మృతికి గల కారణాలను అన్వేషించాలని కోరాడు.
అయితే.. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. బర్డ్ ఫ్లూ అంటూ భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు చనిపోయిన కోళ్లను పరిశీలించిన పశు వైద్యాధికారులు.. బర్డ్ ఫ్లూ కాదని చెబుతున్నారు.
వికారాబాద్ జిల్లాలోనూ ఇదే ఘటన వెలుగుచూసింది. దారూర్ మండలం దోర్నాల్‌లో గత 4 రోజులుగా వందల సంఖ్యలో కోళ్లు, కాకులు మృత్యువాత పడ్డాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. కోళ్లు, కాకుల మృతిపై పశుసంవర్ధకశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.