గురువారం, 27 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Modified: గురువారం, 27 నవంబరు 2025 (14:47 IST)

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

Maruva tarama team with Nara Rohit, Sri Vishnu
Maruva tarama team with Nara Rohit, Sri Vishnu
రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్.వి. విజయ్‌కుమార్ రాజు నిర్మిస్తున్న చిత్రం మరువ తరమా. ఈ మూవీలో హరిష్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వా ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. ఈ మూవీ నవంబర్ 28న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు, నారా రోహిత్, శ్రీవిష్ణు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
 
రఘు రామ కృష్ణరాజు మాట్లాడుతూ, ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటున్నాను అని చైతన్య చెప్పినప్పుడు ఆలోచించుకోమని అన్నాను. కానీ చైతన్య తనమీద తనకున్న నమ్మకంతో ధైర్యంగా అడుగేశారు. నాకు సినిమాలు చాలా ఇష్టం. రోహిణి గారు అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు. ‘మరువ తరమా’ టీజర్, ట్రైలర్ నాకు చాలా నచ్చాయి. విజువల్స్ అద్భుతంగా అనిపించాయి. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా కథ ఉంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నారా రోహిత్, శ్రీ విష్ణు స్నేహబంధానికి ప్రతీక. వారిద్దరూ మంచి మనుషులు, మంచి మిత్రులు. వారిద్దరూ ఈ చిత్ర కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రజలందరి అభిమానాన్ని చూరగొంటుందని విశ్వసిస్తున్నాను. ఇది జనం మెచ్చే చిత్రం అవుతుంది. చిత్రయూనిట్‌కి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
నారా రోహిత్ మాట్లాడుతూ, ఈ సినిమా టీజర్, ట్రైలర్ కూడా బాగున్నాయి. మంచి సినిమా వచ్చినప్పుడల్లా ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ మూవీని కూడా జనాలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. హరీష్ మాకు చాలా ఏళ్ల నుంచి మంచి మిత్రుడు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
శ్రీ విష్ణు మాట్లాడుతూ,  రోహిణి గారు ఓ సినిమా చేశారంటే, పాత్రని ఒప్పుకున్నారంటే జనాలకు ఓ నమ్మకం ఉంటుంది. హరీష్ కోసమే మేం ఇక్కడకు వచ్చాం. హరీష్‌కి మంచి టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్‌ని ఆడియెన్స్ ఇష్టపడతారు. ఇకపై చాలా వేగంగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. డబ్బు కంటే పేరు కోసం ప్రయత్నిస్తున్న వారందరికీ తెలుగు ఆడియెన్స్ సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఈ మూవీని చూసి ఆదరిస్తారని, దీవిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
హరీష్ ధనుంజయ్ మాట్లాడుతూ, చైతన్య మంచి లిరిసిస్ట్. అందుకే ఈ సినిమాలో ప్రతీ చోటా పొయెట్రీ కనిపిస్తుంది. సాయి మా అందరినీ అందంగా చూపించాడు. అవంతిక, అతుల్య అద్భుతంగా నటించారు. మా నిర్మాతల సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. వంద శాతం ఈ చిత్రం ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతుంది. ప్రతీ పాత్రకు అందరూ కనెక్ట్ అవుతారు. ప్రతీ ఒక్కరూ థియేటర్ నుంచి ఓ నవ్వుతో బయటకు వస్తారని గ్యారెంటీగా చెప్పగలను. 
 
డైరెక్టర్ చైతన్య వర్మ నడింపల్లి మాట్లాడుతూ, నిజాయితీగా ఓ అటెంప్ట్ చేశాం. కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయం. ఈ మూవీని చూసి నేను సంతృప్తి చెందాను. ఈ సినిమాను మీడియానే ఆడియెన్స్ వరకు తీసుకు వెళ్తుందని ఆశిస్తున్నాను. ఇక ఈ మూవీ ఫలితాన్ని మీడియా, ఆడియెన్స్‌కే వదిలేస్తున్నాను. అందరూ మా సినిమాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
 
అవంతిక మాట్లాడుతూ* .. ‘‘మరువ తరమా’ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి వస్తున్నాను. నన్ను నమ్మి సింధు అనే పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన టీంకి థాంక్స్. హరీష్, అతుల్య, రోహిణి గార్లతో పని చేయడం ఆనందంగా ఉంది. నవంబర్ 28న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.