1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (17:38 IST)

తెలంగాణాలో వేడెక్కిన రాజకీయాలు : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఈ రాష్ట్రంలో ఇప్పుడప్పుడే ఎన్నికలు లేనప్పటికీ.. ఇప్పటి నుంచే కదనరంగంలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. 
 
నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ళ సమయం వుంది. కానీ, క్షేత్రస్థాయిలో జనంతో ఏకమయ్యేందుకు కసరత్తు మొదలుపెట్టారు. పార్టీ నాయకత్వాన్ని అప్రమత్తం చేసి.. కార్యాచరణ ఎంపిక చేసుకుంటున్నాయి. ఎవరికి వారు.. తెలంగాణలో పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు. 
 
ఇప్పటికే బీజేపీ షెడ్యూల్ సిద్ధంచేసుకుంది. ఇక షర్మిల కూడా అదే బాటలో నడుస్తుంది. పీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి కూడా.. ముందస్తుగా బహిరంగ సభలు, ఆ తర్వాత తన నడకను మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ప్రధాన పార్టీలు అన్నీ… పాదయాత్రకు దారులు వేసుకుంటున్నారు. 
 
దీంతో ఒక్కసారిగా తెలంగాణాలో రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు, సీఎం కేసీఆర్ కూడా దళిత బంధు పథకం ప్రారంభోత్సవం పేరుతో ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇలా నాలుగు ప్రధాన పార్టీల నేతలు రాష్ట్ర పర్యటనల్లో బిజీగా గడుపనున్నారు.