బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (22:57 IST)

బుల్లెట్టు బండి వధువు బంపర్ ఆఫర్.. నెక్ట్స్ పాటకు ఆమెదే డ్యాన్స్?

‘బుల్లెట్టు బండి’ వధువు బంపర్ ఆఫర్ తలుపు తట్టింది. బుల్లెట్టు బండి పాటకు వధువు తన పెళ్లి బరాత్‌లో అద్భుతంగా డ్యాన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. ఒక జానపదం పాటకు చేసిన డ్యాన్స్‌ వీడియో ట్రెండింగ్‌లోకి వెళ్లింది. 
 
ప్రస్తుతం ఆ డ్యాన్స్‌ చేసిన యువతికి ఇప్పుడు ఓ బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. ఏ పాటకైతే డ్యాన్స్‌ చేసిందో ఆ పాటను నిర్మించిన సంస్థ తమ తదుపరి పాటకు డ్యాన్స్‌ చేసే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ నిర్వాహకురాలు ప్రకటించారు. 
 
అయితే ఆమె డ్యాన్స్‌ చేసిన పాటను నిర్మించిన సంస్థ బ్లూ రాబిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. రచయిత లక్ష్మణ్‌ సాహిత్యానికి ఎస్‌కే బాజి సంగీతం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఆ పాటను అద్భుతంగా తెరకెక్కించిన బ్లూ రాబిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్వాహకులు నిరూప స్పందించారు. సాయిశ్రీయతో నిరూప ఫోన్‌లో మాట్లాడారు. 
 
వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌ఓ రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె సాయి శ్రీయను రామకృష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఈనెల 14వ తేదీన వివాహమైంది. అప్పగింతల సమయంలో సాయిశ్రీయ చేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.