శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (16:19 IST)

పెళ్లి బృందం వెళ్తున్న పడవపై పిడుగుపాటు-18మంది మృతి

monsoon storms
బంగ్లాదేశ్‌లో విషాదం నెలకొంది. పెళ్లి బృందం వెళ్తున్న పడవపై పిడుగు పడింది. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. చపాయ్‌నవాబ్‌గంజ్‌ జిల్లా షిబ్‌గంజ్‌లోని తెలిఖారిఘాట్‌ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ పెళ్లి బృందం పద్మా నది ఒడ్డున పడవ ఎక్కి అవతలి ఒడ్డుకు వెళ్దానుకున్నారు. పడవలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా ఉన్నారు. మొత్తం 20 మందికి పైగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 
 
పడవ బయలుదేరిన కాసేపటికే కుండ పోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపుతో వాతావరణం భీకరంగా మారింది. ఆ సమయంలోనే పద్మానదిలో వెళ్తున్న పడవపై పిడుగు పడింది. స్పాట్‌లోనే 18 మంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
 
పిడుగుపాటు వల్లే అందరూ చనిపోయారని.. పడవ నీటిలో మునిగేలోపే వారు మరణించారని స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలనాకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో పెళ్లికొడుకు గాయపడగా, పెళ్లికూతురు సురక్షితంగా బయటపడిందని అధికారులు తెలిపారు.