1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 జులై 2021 (18:19 IST)

పోలీసులకు 'వీక్ ఆఫ్': పుట్టినరోజు, పెళ్లి రోజుకు కూడా లీవ్ ఇస్తాం..?!

Tamil Nadu Cops
పోలీసు ఉద్యోగం అంటేనే చాలామందికి అలుసు. ఆ ఉద్యోగంలో వున్న వారికి సెలవులు వుండవంటుంటారు. పోలీస్ ఉద్యోగంలో వున్న వారికి వీక్ ఆఫ్ అన్న మాటే ఉండదు. ప్రతిరోజు డ్యూటీలో ఉండాల్సిందే. దాంతో పోలీసులు కుటుంబంతో గడపడానికి అసలు సమయమే ఉండదు. ఇక విశ్రాంతి సంగతి  కూడా అంతే. 
 
ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడు ప్రభుత్వం పోలీసుల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుండి పోలీసులకు కూడా వీక్ ఆఫ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. పుట్టినరోజు, పెళ్లి రోజున కూడా సెలవు ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు డీజీపీ శైలేంద్ర బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ ఈ సెలవుల్లో తప్పకుండా పనిచేయాల్సిన పరిస్థితి వస్తే అదనపు పేమెంట్ ఇస్తామని.. ఈ ఉత్తర్వులు త్వరలోనే అమలులోకి వస్తాయని శైలేంద్ర బాబు తెలిపారు. 
 
ఇక తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ వార్త తెలిసిన ఇతర రాష్ట్రాల పోలీసులు తమకు కూడా తమిళనాడు ప్రభుత్వం అమలు చేసిన విధంగా వీక్ ఆఫ్‌లు ఇవ్వాలని కోరుతున్నారు.