సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 20 జులై 2021 (15:44 IST)

ఒక పెళ్ళి తెచ్చిన తంటా 40 మందికి కరోనా... మళ్ళీ ప్రారంభమైందా?

విశాఖ జిల్లాలో ముప్పుతెచ్చిపెట్టిన శుభకార్యాలు. రాంబిల్లి మండలం రాజుకోడూరులో 40 మందికి కరోనా సోకింది. కర్ఫ్యూ మినహాయింపుల తరువాత అత్యధిక కేసులు నమోదైన గ్రామంగా నిలిచింది.
 
విశాఖ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అందరూ భావించారు. దీంతో సామాజిక దూరాన్ని, మాస్కులను గాలికొదిలేశారు. ముఖ్యంగా శుభకార్యాలకు వెళ్ళేవారి సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు శుభకార్యాల్లో మాస్కులు ధరించడం మానేశారు.
 
థర్డ్ వేవ్ ఎప్పుడో వస్తుందని ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని విశాఖ జనం నిర్ణయం తీసేసుకున్నారు. ఇలా చేయడంతో కరోనా మహమ్మారి ఒక వివాహంలో విజృంభించింది. 
 
రాబిల్లి మండలం రాజుకోడూరులో ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన 40 మందికి కరోనా సోకింది. వివాహానికి హాజరైన వారిలో ఒక వ్యక్తికి పాజిటివ్ ఉండడం.. అతనికి తెలియకుండా వివాహానికి హాజరవ్వడంతో అక్కడకు వచ్చిన మిగిలిన వారందరికీ ఈ వైరస్ సోకింది. 
 
వివాహానికి హాజరైన మరుసటి రోజు నుంచే జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉండటంతో కొంతమంది వెళ్ళి ఆర్టీపీసీఆర్ ద్వారా చెకప్ చేసుకున్నారు. దీంతో పాజిటివ్ అని తేలడం వారు వివాహానికి హాజరైనట్లు వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళడంతో వెంటనే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వివాహానికి హాజరైన అందరికీ పరీక్షలు చేసి 40 మందికి కరోనా సోకినట్లు నిర్థారించారు.