గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (11:01 IST)

నేడు సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు..

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. అయితే, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం (నేడు) వెలువడనున్నాయి. 
 
మంగళవారం సాయంత్రం ఈ ఫలితాలను ప్రకటించే అవకాశముందని పలు మీడియాలు పేర్కొంటున్నాయి. అయితే.. పదో తరగతి ఫలితాలపై సీబీఎస్ఈ, కేంద్ర విద్యాశాఖ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 
 
కానీ అంతకుముందు బోర్డు చెప్పిన వివరాల ప్రకారం ఈ రోజు ఫలితాలు వెల్లడయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో సాయంత్రం నాటికి ఫలితాలు విడుదల అవుతాయని భావిస్తున్నారు. అయితే.. బోర్డు నుంచి అధికారిక ప్రకటన లేనప్పటికీ, విద్యార్థులు తమ 10వ తరగతి ఫలితాలు ఎలా ఉంటాయో చూసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.