1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 జులై 2021 (10:50 IST)

ఏపీలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఎలా కేటాయిస్తారంటే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థుందరినీ వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే ఉత్తీర్ణులు చేశారు. దీంతో విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్టు ప్రకటించారు. అదేసమయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు గత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా ‘ఆల్‌ పాస్‌’కు బదులు గ్రేడ్లు ప్రకటించాలని నిర్ణయించింది. విద్యా సంవత్సరంలో విద్యార్థులు రాసిన సమ్మేటివ్, ఫార్మేటివ్‌ పరీక్షల మార్కుల ఆధారంగా పదో తరగతి గ్రేడ్లు ఇవ్వనున్నారు. 
 
గతేడాది కరోనా వల్ల పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేక రాష్ట్ర విద్యా శాఖ విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. వారి ధ్రువపత్రాల్లో సబ్జెక్టులకు గ్రేడ్లు బదులు.. పాస్‌ అని మాత్రమే ఇచ్చారు. 
 
దీంతో వారి ఉన్నత చదువులకు ఇబ్బందులేర్పడ్డాయి. కరోనా మహమ్మారి వల్ల గత విద్యా సంవత్సరం(2019–20)లో పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ‘ఆల్‌ పాస్‌’గా ప్రకటించిన విద్యార్థులందరికీ తాజాగా గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది.